జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

17-09-2021 Fri 17:27
  • యంగ్ టైగర్-కొరటాల కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్
  • హీరోయిన్‌గా బాలీవుడ్ భామ అలియాభట్ కోసం ప్రయత్నం
  • రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ జోడీగా నటిస్తున్న అలియా
bollywood beauty to cast in next junior NTR movie

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ ‌కు జోడీగా అలియాభట్ నటిస్తోంది. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ నటించే సినిమాలో ఈమెను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

కొరటాల-ఎన్టీఆర్‌ కలయికలో తెరకెక్కే ఈ క్రేజీ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అలియాభట్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందని, దీంతో క్రేజీ ప్రాజెక్టులో క్రేజీ హీరోయిన్ ఎంపికైందని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

 కాగా, కొరటాల-తారక్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ వంటి భారీ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.