India: నిమిషానికి 42 వేల మందికి కరోనా టీకా.. ఇవాళ ఇప్పటికే 1.23 కోట్ల మందికి!

  • ఒకే రోజు కోటి డోసులు నెలలో నాలుగోసారి
  • 2 కోట్ల మార్కును దాటేందుకు టార్గెట్
  • కొవిన్ పోర్టల్ లో రియల్ టైం అప్ డేట్స్
India Aims To Vaccinate Record 2 Crore People In a Single Day

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా రికార్డ్ వ్యాక్సినేషన్ పై భారత్ గురి పెట్టింది. ఇవాళ ఇప్పటికే కోటి మందికి అధికారులు టీకాలు వేశారు. నిమిషానికి 42 వేల మందికి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లను అందించారు. ఇవాళ మధ్యాహ్నానికే కోటి డోసుల మార్కును దాటామని, ఒకే రోజు కోటి టీకాల మార్కును దాటడం నెలలో ఇది నాలుగోసారి అని ఓ అధికారి చెప్పారు. ఇవాళ రెండు కోట్ల మార్కును దాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

వ్యాక్సిన్ వేస్తున్న అధికారుల నిరంతర శ్రమతో సెకనుకు 700 మందికి లేదా నిమిషానికి 42 వేల మందికి టీకాలు వేయగలుగుతున్నామని, రియల్ టైంలో వ్యాక్సినేషన్ పురోగతిని ట్రాక్ చేసేందుకు వీలుకల్పించామని నేషనల్ హెల్త్ అథారిటీ అధిపతి ఆర్ఎస్ శర్మ చెప్పారు. కొవిన్ సైట్ లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాగా, ఇప్పటిదాకా 1.23 కోట్ల మందికి టీకాలు వేశారు. రియల్ టైం ఫీచర్ ను తీసుకురావడంతో సెకనుసెకనుకు కొవిన్ పోర్టల్ లో వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య మారుతోంది.

More Telugu News