Telangana: తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

TS Governor Tamilisai wishes Telangana Liberation Day
  • విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్
  • ఈరోజే సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమన్న కేకే
  • హైదరాబాద్ విమోచన దినోత్సవమంటూ గవర్నర్ ట్వీట్
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రాధాన్యత ఉంది. భారతదేశానికి ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే... నిజాంల నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం లభించింది. దీంతో, ఈ రోజును విమోచన దినోత్సవంగా కొందరు, విలీన దినోత్సవంగా మరికొందరు జరుపుకుంటుంటారు.

ఈరోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ విలీన దినోత్సవాన్ని నిర్వహించగా... పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంది. విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద జాతీయ జెండాను ఎగువేసిన టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే మాట్లాడుతూ, ఈరోజే మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని అన్నారు.

మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడుపడవి విధంగా ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని తాను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర గవర్నర్ చేసిన ట్వీట్ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది.
Telangana
Tamilisai Soundararajan
Governor
Telangana Liberation Day

More Telugu News