Samantha: కొత్త దర్శకుడికి సమంత గ్రీన్ సిగ్నల్!

Samantha in new Director movie
  • లేడీ ఓరియెంటెడ్ కథలవైపు మొగ్గు
  • షూటింగును పూర్తిచేసుకున్న 'శాకుంతలం'
  • శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమా
  • త్వరలో పూర్తి వివరాలు    
వివాహమైన తరువాత సమంత గ్లామరస్ పాత్రలకు దూరంగా వెళ్లింది. నటన ప్రధానమైన పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. సాధ్యమైనంతవరకూ నాయిక ప్రధానమైన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతోంది. 'ఓ బేబీ' .. 'యూ టర్న్' .. 'జాను' సినిమాలు అలా వచ్చినవే.

'శాకుంతలం' కథ అంతా కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సమంత బాలీవుడ్ సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ఒక కొత్త దర్శకుడు ఆమెకు ఒక కథ వినిపించగా, కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వెంటనే అంగీకరించిందని అంటున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Samantha
Shakunthalam
Gunasekhar

More Telugu News