'మరో ప్రస్థానం' ట్రైలర్ రిలీజ్!

16-09-2021 Thu 18:55
  • జానీ దర్శకత్వంలో తనీష్
  • యాక్షన్ థ్రిల్లర్ గా సాగే కథ
  • కథానాయికగా ముస్కాన్ సేథీ
  • ఈ నెల 24వ తేదీన విడుదల  
Maro Prasthanam trailer released

తనీష్ హీరోగా దర్శకుడు జానీ 'మరో ప్రస్థానం' సినిమాను రూపొందించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాను మిర్త్ మీడియావారు నిర్మించారు. తనీష్ జోడీగా ముస్కాన్ సేథీ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో భానుశ్రీ మెహ్రా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరోకి .. విలన్ గ్యాంగ్ కి మధ్య నడిచే వార్ ప్రధానంగా ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. కబీర్ దుహాన్ సింగ్ విలనిజాన్ని కొత్త కోణంలో చూపించినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుందనీ, ఈ సినిమా తనని మరో మెట్టు పైకి చేరుస్తుందని తనీష్ అంటున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.