Raju: రాజు విషయంలో పోలీసుల అంచనాలే నిజమయ్యాయా?

  • సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
  • భగ్గుమన్న పౌర సమాజం
  • రాజు ఆచూకీ కోసం పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం
  • అన్ని వైపులా రాజుపై ఒత్తిడి పెంచిన పోలీసులు
  • రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న రాజు
Police predicts Raju suicide

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుంటాడని పోలీసులు ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సైదాబాద్ లో బాలిక శవమై కనిపించడంతో పౌర సమాజం భగ్గుమంది. చిన్నారిపై అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమైన రాజును చంపేయాల్సిందేనంటూ ప్రతి ఒక్కరూ ఘోషించారు. దాంతో పోలీసులు రాజు కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు.

సెప్టెంబరు 9న ఘటన జరగ్గా, అప్పటినుంచి అతడి కోసం వేటాడారు. రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు, అతడి కోసం తెలంగాణ అంతటా జల్లెడ పట్టారు. ఆటోలు, బస్సులు, రైళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.

కాగా, రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయని ముందే ఊహించిన పోలీసులు... రైలు కిందపడి చనిపోయిన వారి మృతదేహాలను కొన్నిరోజుల క్రితమే పరిశీలించారు. మార్చురీల్లో భద్రపరిచిన వారి శవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నిన్న రాజు ఉప్పల్ లో సంచరించినట్టు గుర్తించారు. చివరికి స్టేష‌న్ ఘ‌న్‌పూర్ వద్ద రైలు పట్టాలపై చనిపోయి కనిపించాడు. పోలీసులు అనుమానించినట్టే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అది రాజు మృతదేహమేనని గుర్తించారు.

More Telugu News