నా కొడుకును పోలీసులే చంపారు: రాజు తల్లి వీరమ్మ ఆరోపణ

16-09-2021 Thu 14:53
  • సైదాబాద్ లో బాలికపై హత్యాచారం
  • సర్వత్రా ఆగ్రహావేశాలు
  • రైలు పట్టాలపై శవమై కనిపించిన రాజు
  • ఆత్మహత్య అని ప్రాథమికంగా అంచనా
Raju mother Veeramma alleges police killed her son

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు రైలు పట్టాలపై శవమై కనిపించడం తెలిసిందే. రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ దుర్మార్గుడికి అదే తగిన శిక్ష అని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాగా, రాజు తల్లి వీరమ్మ మాత్రం పోలీసులపై ఆరోపణలు చేస్తోంది. తన కుమారుడిని పోలీసులే చంపారని అంటోంది. తమను పోలీసులు వదిలిపెట్టినప్పుడే రాజు పోలీసులకు దొరికినట్టు అర్థమైందని పేర్కొంది. రాజును రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందని వెల్లడించింది. రాజును పోలీసులు మూడు రోజుల క్రితమే అరెస్ట్ చేశారని వీరమ్మ చెబుతోంది.

అటు, రాజు భార్య మౌనిక కూడా ఈ అంశంలో స్పందించింది. తన భర్త చావుకు న్యాయం జరగాలని, లేకుంటే తాను కూడా చచ్చిపోతానని స్పష్టం చేసింది.