Bajireddy Govardhan: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కీలక పదవిని కట్టబెట్టిన కేసీఆర్

MLA Bajireddy Govardhan appointed as TSRTC chairman
  • ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం
  • ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన బాజిరెడ్డి
  • నిజామాబాద్ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాజిరెడ్డి
టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గోవర్ధన్ ఉన్నారు. తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని అప్పగించిన కేసీఆర్ కు గోవర్ధన్ ధన్యవాదాలు తెలియజేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో గోవర్ధన్ జన్మించారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత... గోవర్ధన్ కూడా వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. 2014లో నిజామాబాద్ నుంచి డి.శ్రీనివాస్ పై పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయనకు కేసీఆర్ కీలక పదవిని అప్పగించారు.
Bajireddy Govardhan
TRS
TSRTC
Chairman
KCR

More Telugu News