ఏపీలో కొత్తగా 1,445 కరోనా కేసుల నమోదు .. అప్డేట్స్ ఇవిగో!

15-09-2021 Wed 20:32
  • గత 24 గంటల్లో 62,252 మందికి పరీక్షలు  
  • రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,603
AP Registers 1445 news Covid cases in 24 hours

ఏపీలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 62,252 మంది శాంపిల్స్ పరీక్షించగా 1,445 మందికి కరోనా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 274, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 11 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల 11 మంది మృతి చెందారు. 1,243 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,33,419కి చేరుకుంది. ఇప్పటి వరకు 20,04,786 మంది కోలుకున్నారు. మొత్తం 14,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి.