Kareena Kapoor: బాలీవుడ్ భామ కరీనాకు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం.. ఆపేసిన అధికారులు

heroine kareena kapoor stopped at airport
  • సైఫ్ అలీఖాన్‌తో కలిసి టూర్‌కు బయల్దేరిన కరీనా కపూర్
  • రెండో కుమారుడు జహంగీర్‌ కేర్ టేకర్‌ను అడ్డుకున్న అధికారులు
  • ఆ వెంటనే హీరోయిన్‌ను కూడా అడ్డుకున్న వైనం
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి టూర్‌కు బయల్దేరిన ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కూడా అధికారులు ఇలా అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు జరిగిన ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..  భర్త సైఫ్ అలీ ఖాన్, పెద్ద కుమారుడు తైమూర్, రెండో కుమారుడు జహంగీర్‌తో కలిసి కరీనా ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ సైఫ్, తైమూర్ ఎటువంటి ఇబ్బందీ లేకుండానే విమానాశ్రయంలోకి వెళ్లారు. అయితే జహంగీర్‌ను చంకనేసుకొని వస్తున్న ఆమె కేర్ టేకర్‌ను ఎయిర్ పోర్టు అధికారులు ఆపారు. ఆమె పాస్‌పోర్ట్ చెక్ చేశారు. దీంతో ముందుకొచ్చిన కరీనా వారితో మాట్లాడటానికి ప్రయత్నించింది. దీంతో ఆమె పాస్‌పోర్టును అధికారులు అడిగారు.

ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిపోయిన సైఫ్ వెనక్కు వచ్చాడు. భార్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన కొందరు అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Kareena Kapoor
Saif Ali Khan
Bollywood

More Telugu News