అమెజాన్ ప్రైమ్ లో 'టక్ జగదీష్'కి దక్కిన రికార్డ్!

15-09-2021 Wed 18:01
  • గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా
  • అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల  
  • ఫస్టు డే ఎక్కువమంది చూసిన తెలుగు సినిమా  
Tuck Jagadish movie update

నాని కథానాయకుడుగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఉమ్మడి కుటుంబంలోని పరిస్థితులను .. ఊరు సమస్యలను చక్కదిద్దే పౌరుడిగా ఈ సినిమాలో నాని కనిపిస్తాడు. ఈ సినిమాలో నాని సరసన నాయికగా రీతూ వర్మ నటించగా, ప్రతినాయకుడిగా డేనియల్ బాలాజీ కనిపించాడు.

ఈ సినిమా పెట్టుబడి 34 కోట్ల వరకూ అయిందట. అన్ని హక్కులను అమ్మడం వలన నిర్మాతలకు 17 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. ఇంతవరకూ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అన్ని తెలుగు సినిమాలలో, తొలిరోజే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా 'టక్ జగదీష్' రికార్డును సొంతం చేసుకుందని చెబుతున్నారు. అలా తన పేరుతో నాని ఒక రికార్డును సెట్ చేసి పెట్టాడన్న మాట.