దీపావళి పై దృష్టి పెట్టిన 'శ్యామ్ సింగ రాయ్'

15-09-2021 Wed 11:39
  • విభిన్నమైన కథాంశంతో 'శ్యామ్ సింగ రాయ్'
  • నాని సరసన ముగ్గురు కథానాయికలు
  • కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా
  • విడుదల విషయంలో త్వరలో రానున్న స్పష్టత

Shyam Singa Roy movie release update

నాని - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా, విభిన్నమైన కథాకథనాలతో సాగనుంది. ఆల్రెడీ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. అక్టోబర్ చివరివారంలోగానీ, దీపావళికి గాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

దాదాపు దీపావళి పండుగకు రావొచ్చునని చెప్పుకుంటున్నారు. నాని సరసన ముగ్గురు కథానాయికలు అలరించనుండటం విశేషం. సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ .. ఈ ముగ్గురి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా .. మురళీశర్మ కనిపించనున్నారు.