కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన నవీన్ పోలిశెట్టి!

15-09-2021 Wed 11:03
  • 'జాతిరత్నాలు'తో దక్కిన హిట్
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  • సితార బ్యానర్లో అవకాశం
  • దర్శకుడిగా కల్యాణ్ శంకర్ పరిచయం
Naveen Polishetty new movie update

తెలుగు తెరపై హాస్య కథానాయకులు తమ జోరును కొనసాగిస్తున్నారు. వాళ్లలో నవీన్ పోలిశెట్టి కూడా ముందు వరసలో కనిపిస్తున్నాడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా హిట్ అయినప్పటికీ, ఆయన సరైన కథ కోసం కొంతకాలం వెయిట్ చేశాడు. ఇటీవల వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా ఆయన కెరియర్లోనే చెప్పుకోదగిన విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత ఒకటి రెండు కాంబినేషన్లతో ఆయన పేరు వినిపించినప్పటికీ, అవి కార్యరూపాన్ని దాల్చలేదు. తాజాగా ఆయన ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఆ దర్శకుడి పేరే కల్యాణ్ శంకర్. సితార బ్యానర్ ... ఫార్చూన్ 4 సినిమా వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అప్పుడు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి నవీన్ కాస్త లేట్ చేసినా పెద్ద బ్యానర్లోనే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.