ఆ ట్వీట్ పొరబాటున చేశాను... సైదాబాద్ నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు: కేటీఆర్

14-09-2021 Tue 22:24
  • సైదాబాద్ లో బాలికపై హత్యాచారం
  • కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారన్న కేటీఆర్
  • తన ట్వీట్ పట్ల విచారం వ్యక్తం చేసిన వైనం
  • తప్పుడు సమాచారం వల్లే ఆ ట్వీట్ చేసినట్టు వివరణ
KTR regrets his tweet on Saidabad incident

హైదరాబాదులోని సైదాబాదులో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటనలో తాను మొదట చేసిన ట్వీట్ పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడ్ని పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు పొరబాటున ట్వీట్ చేశానని కేటీఆర్ అంగీకరించారు. ఆ ట్వీట్ ను తొలగిస్తున్నట్టు ఓ ప్రకటన చేశారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడి విషయంలో తనకు తప్పుడు సమాచారం అందిందని వెల్లడించారు.

నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని, అతడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితుడ్ని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని, తద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.