తెలంగాణలో మరో 336 మందికి కరోనా పాజిటివ్

14-09-2021 Tue 20:33
  • గత 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 96 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,282 మందికి చికిత్స
Telangana corona report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా, 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 96 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 24, వరంగల్ అర్బన్ జిల్లాలో 24, కరీంనగర్ జిల్లాలో 21 కేసులు గుర్తించారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 306 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,62,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,53,022 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,282 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,898కి పెరిగింది.