పశ్చిమబెంగాల్ అడ్వొకేట్ జనరల్ రాజీనామా

14-09-2021 Tue 17:45
  • ఏజీ పదవికి కిశోర్ దత్త రాజీనామా
  • రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర గవర్నర్
  • 2017లో ఏజీగా బాధ్యతలను స్వీకరించిన దత్త
West Bengal Advocate General resigns

పశ్చిమబెంగాల్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్త తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్ర గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ కు పంపించారు. వెంటనే రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దత్త రాజీనామాను ఆమోదించినట్టు రాజ్ భవన్ ప్రకటించింది. 2017లో అడ్వొకేట్ జనరల్ గా కిశోర్ దత్త బాధ్యతలను స్వీకరించారు.

మమత సీఎం అయిన తర్వాత అడ్వొకేట్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించిన నాలుగో వ్యక్తి దత్త. దీదీ సీఎం అయిన తర్వాత ఆనింద్య మిత్ర తొలి ఏజీగా పని చేయగా... ఆ తర్వాత బిమాల్ ఛటర్జీ, జయంత మిత్ర కొనసాగారు. ఇప్పుడు కిశోర్ దత్త కూడా రాజీనామా చేయడంతో ఐదో వ్యక్తికి ఆ బాధ్యతలను నిర్వహించే అవకాశం వచ్చింది.