బాలయ్య న్యూ మూవీ టైటిల్ 'రౌడీయిజం'?

14-09-2021 Tue 16:58
  • త్వరలో 'అఖండ' షూటింగు పూర్తి
  • నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
  • తెరపైకి త్రిష .. ఇలియానా పేర్లు  
Balakrishna new movie title

మొదటి నుంచి కూడా సినిమాకి .. సినిమాకి మధ్య బాలకృష్ణ గ్యాప్ లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేస్తూ ఉంటారు. అలా ఆయన 'అఖండ' ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే, గోపీచంద్ మలినేని ప్రాజెక్టును లైన్లో పెట్టేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.

గోపీచంద్ మలినేని 'క్రాక్' తరహాలోనే ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం తాజాగా 'రౌడీయిజం' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం త్రిష - ఇలియానాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు.