Stalin: మరో కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్

Stalin declares free journey in RTC buses to Police
  • పోలీసులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • పోలీసుల భార్యలకు కూడా ప్రతి ఏటా ఉచిత వైద్య పరీక్షలు
  • రిస్క్ అలవెన్సు పెంపు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి స్టాలిన్ సంచలన నిర్ణయాలను తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీసులపై ఆయన వరాల జల్లు కురిపించారు.

పోలీసులు పని చేస్తున్న జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీనికి తోడు ఇప్పుడు అందిస్తున్న రిస్క్ అలవెన్సును రూ. 800 నుంచి రూ. 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిఏటా పోలీసులకు చేస్తున్న వైద్య పరీక్షలను ఇకపై వారి భార్యలకు కూడా ఉచితంగా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. చెన్నైలోని థౌజెండ్ లైట్స్ ప్రాంతంలో రూ. 275 కోట్లతో క్వార్టర్స్ ను నిర్మించనున్నట్టు తెలిపారు.
Stalin
Tamil Nadu
Police

More Telugu News