సాయితేజ్ శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుంది: అపోలో వైద్యులు

14-09-2021 Tue 14:32
  • అపోలో ఆసుపత్రిలో సాయితేజ్ కు కొనసాగుతున్న చికిత్స
  • తాజా బులెటిన్ విడుదల
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
  • సంతృప్తికరంగా బయోమెడికల్ పరీక్షల నివేదికలు
Apollo hospital released latest health bulletin of Sai Tej

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. సాయితేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ అవసరం తగ్గుతోందని తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలోని ముఖ్య భాగాల పనితీరు బాగుందని వెల్లడించారు. బయోమెడికల్ టెస్టుల నివేదికలు సంతృప్తికరంగా ఉన్నాయని వివరించారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్ లో పేర్కొన్నారు.