హైదరాబాద్‌లోని ఈ రెండు ప్రాంతాల్లోనూ స్వచ్ఛమైన గాలి ఉందట!
- జూబ్లీహిల్స్, ఉప్పల్ లో నాణ్యమైన గాలి
- తన నివేదికలో వెల్లడించిన పీసీబీ
- ఈ నెల 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదు
ఈ నెల 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదయింది. ఈ రెండు ప్రాంతాలతో పాటు ప్యారడైజ్, బాలానగర్, చార్మినార్ ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత బాగుందని పీసీబీ తెలిపింది. జీడిమెట్ల ప్రాంతంలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. గాలి నాణ్యత విషయానికి వస్తే 0 నుంచి 50 వరకు ఉంటే బాగుందని... 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమని... 101 నుంచి 200 మధ్య ఉంటే ఓ మాదిరి అని... 201 నుంచి 300 మధ్య ఉంటే పూర్ అని... 301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్ అని... 400 పైన నమోదయితే తీవ్ర కాలుష్యంగా భావిస్తారు.