'థ్యాంక్యూ సామ్' అంటూ నాగ‌చైత‌న్య ట్వీట్!

14-09-2021 Tue 11:20
  • ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్ విడుద‌ల‌పై స‌మంత స్పంద‌న‌
  • ఆల్ ది బెస్ట్ చెప్పిన సామ్
  • స‌మంత‌ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన చైతూ
chitu says thanks to sam

సినీన‌టులు, భార్యాభ‌ర్త‌లు స‌మంత‌, నాగ‌చైత‌న్య మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని కొన్ని రోజులుగా ప్రచారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, నాగ‌చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి న‌టించిన ల‌వ్ స్టోరీ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన నేప‌థ్యంలో ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ స‌మంత ట్వీట్ చేసింది. అలా చైతూతో త‌న‌కు విభేదాలు ఏమీ లేవ‌న్న సంకేతాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా అదే ప్ర‌య‌త్నం చేస్తూ ట్వీట్ చేశాడు.

త‌మ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ స‌మంత చేసిన ట్వీట్‌ను చైతూ రీట్వీట్ చేస్తూ థ్యాంక్యూ సామ్ అని పేర్కొన్నాడు. కాగా, స‌మంత‌, నాగ‌చైత‌న్య మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని జ‌రుగుతోన్న‌ ప్రచారంపై అటు స‌మంత, ఇటు చైతూ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. ఇటీవ‌ల ఇదే విష‌యంపై స‌మంత‌ను మీడియా ప్రశ్నించగా, ఆమె స‌మాధానం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం స‌మంత‌, చైతూ త‌మ సినిమా షూటింగుల ప‌నుల్లో బిజీగా గ‌డుపుతున్నారు.