సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-09-2021 Tue 07:28
  • పీవీ సింధు పాత్రలో బాలీవుడ్ భామ
  • 'ఆచార్య' కోసం చివరి పాట చిత్రీకరణ
  • అనిల్ రావిపూడితో రామ్ ప్రాజక్ట్     
Deepika plays PV Sindhu in her biopic

*  ఒలింపిక్ విన్నర్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుపై బయోపిక్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొణే ఈ చిత్రంలో సింధు పాత్రను పోషిస్తుంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని దీపిక తన సొంత బ్యానర్ పై నిర్మించేందుకు ఒప్పందం చేసుకుందట.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. చిరంజీవి, రామ్ చరణ్ లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ పాట పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.
*  ఎనర్జిటిక్ హీరో రామ్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలుసుకుని ఈ చిత్రం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రామ్ నటిస్తుండగా.. అనిల్ రావిపూడి 'ఎఫ్ 2'కి సీక్వెల్ చేస్తున్నారు.