తెలంగాణలో మరో 315 కరోనా పాజిటివ్ కేసులు

13-09-2021 Mon 21:33
  • గత 24 గంటల్లో 70,974 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 75 కొత్త కేసులు 
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 5,253 మందికి చికిత్స 
Telangana corona cases daily status report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 70,974 కరోనా పరీక్షలు నిర్వహించగా, 315 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 75 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, ఖమ్మం జిల్లాలో 23 కేసులు గుర్తించారు. నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 318 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,866 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,52,716 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,253 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,897కి పెరిగింది.