బోయ్ ఫ్రెండ్ తో బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్ మెంట్

13-09-2021 Mon 17:42
  • బోయ్ ఫ్రెండ్ శామ్ అస్ఘరీతో ఎంగేజ్ మెంట్
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట
  • బ్రిట్నీకి గ్రీటింగ్స్ చెప్పిన పారిస్ హిల్టన్
Britney Spears Is Engaged Sam Asghari

హాలీవుడ్ నటి, సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (39) సంచలన ప్రకటన చేసింది. తన బోయ్ ఫ్రెండ్ శామ్ అస్ఘరీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు ఆమె ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో రూపంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వీడియోలో ఆమె ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపించింది. 'రింగ్ నీకు నచ్చిందా?' అని ఆమె ప్రియుడు ప్రశ్నించగా... 'ఎస్' అంటూ ఆమె సమాధానం ఇవ్వడం వీడియోలో ఉంది.

2016లో ఓ మ్యూజిక్ వీడియో సందర్భంగా వీరిద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇన్స్టాలో ఈ పోస్టును చూసిన వెంటనే ఆమె బెస్ట్ ఫ్రెండ్, పాప్ సింగర్, హాలీవుడ్ నటి పారిస్ హిల్టన్ స్పందిస్తూ బ్రిట్నీకి శుభాకాంక్షలు తెలిపింది. బ్రిట్నీ ప్రియుడు శామ్ కూడా నటుడే కావడం గమనార్హం.