ఏపీ జడ్జిలపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వేర్వేరు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ

13-09-2021 Mon 17:19
  • జడ్జిలను దూషించిన వైనం
  • సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు
  • తొలుత సీఐడీ విచారణ
  • సీబీఐకి అప్పగించిన హైకోర్టు
CBI files separate charge sheets in social media posts case

గతేడాది ఏపీలో కొందరు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం న్యాయ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తొలుత ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా, సీఐడీ విచారణపై అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు గతేడాది అక్టోబరు 8న ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీఐడీ నుంచి సమాచారాన్ని స్వీకరించిన సీబీఐ సెప్టెంబరు 11న కేసు నమోదు చేసి పలువురిపై చార్జిషీట్లు దాఖలు చేసింది.

తాజాగా మరో నలుగురిపై వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆదర్శ్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివారెడ్డి, సుధీర్ లపై అభియోగాలు మోపింది. కాగా ఈ కేసులో నిందితులను జులై 27, ఆగస్టు 7 తేదీల్లో అరెస్ట్ చేశారు. విజయవాడ, హైదరాబాదు నగరాల్లో వారిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.