అమిత్ షా సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

13-09-2021 Mon 16:27
  • ఇటీవల సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా
  • కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
  • ఆమోదం తెలిపిన బీజేపీ శాసనసభాపక్షం
  • పటేల్ తో ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్
Bhupendra Patel takes oath as Gujarat new Chief Minister

గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. 59 ఏళ్ల భూపేంద్ర పటేల్ తో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

ఇటీవల సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో గుజరాత్ బీజేపీ శాసనసభాపక్షం భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు కూడా తోడవడంతో భూపేంద్ర పటేల్ కు ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదు. భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.