'బండ్ల గణేశ్ కంటే నాకు 'మా' ముఖ్యం: ప్రకాశ్ రాజ్

12-09-2021 Sun 16:15
  • 'మా' సభ్యులతో ప్రకాశ్ రాజ్ భేటీ
  • జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ముగిసిన సమావేశం
  • బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన
  • ఆ వ్యాఖ్యలు బండ్ల గణేశ్ వ్యక్తిగతమని వెల్లడి
Prakash Raj reacts to Bandla Ganesh comments

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో 'మా' సభ్యులతో ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. బండ్ల గణేశ్ కంటే తనకు 'మా' ముఖ్యమని ఉద్ఘాటించారు. గతంలో ఎన్నికలప్పుడు ప్రశ్నించని బండ్ల గణేశ్ ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. 'మా' ఎన్నికలంటే యుద్ధమో, లేక క్రికెట్ మ్యాచో కాదని పేర్కొన్నారు.