వివేకానందుడి సందేశాన్ని ప్రపంచం ఆమోదించి ఉంటే 9/11 దాడులు జరిగుండేవి కావు: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- 128 ఏళ్ల కిందట అమెరికాలో వివేకానందుడి ప్రసంగం
- ఇదే రోజున షికాగోలో సభకు హాజరైన వివేకానందుడు
- ఇదే రోజున అమెరికాలో ఉగ్రదాడులు
- ఈ అంశాన్ని నేడు ప్రస్తావించిన రామ్ నాథ్ కోవింద్
"128 ఏళ్ల కిందట ఇదే రోజున షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు భారతీయ మత, తాత్విక చింతనలను ప్రపంచానికి చాటిచెప్పారు. న్యాయం, సహానుభూతి, సహకారం ఆధారంగా భారత సంస్కృతి పరిఢవిల్లుతోందని సోదాహరణంగా చూపించారు. 1983 నాటి ఆ విలువైన సందేశాన్ని ప్రపంచం గుర్తించి ఉంటే అమెరికాలో మానవత్వంపై జరిగిన భీకర ఉగ్రదాడులకు సాక్షీభూతంగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు" అని రామ్ నాథ్ కోవింద్ వివరించారు.