తన బయోపిక్ లో తన పాత్రను ఎవరు చేయాలని జయలలిత కోరుకున్నారో తెలుసా?

11-09-2021 Sat 16:54
  • తన పాత్రను ఐశ్వర్య రాయ్ చేయాలని జయ అనుకున్నారన్న సిమి గరేవాల్
  • అయితే కంగన అద్భుతంగా నటించిందని కితాబు
  • ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి ఒదిగిపోయారని వ్యాఖ్య
Jayalalitha wanted Aishwarya Rai to play her character in her biopic

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత బయోపిక్ 'తలైవి' నిన్న విడుదలైంది. బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఈ చిత్రంలో జయలలిత పాత్రను పోషించారు. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తలైవి' చిత్రాన్ని తాను చూశానని, చాలా బాగుందని చెప్పారు. వాస్తవానికి తన బయోపిక్ లో తన పాత్రను ఐశ్వర్య రాయ్ పోషించాలని జయలలిత కోరుకున్నారని తెలిపారు. ఐశ్వర్య అయితే తన పాత్రకు న్యాయం చేస్తుందని అనుకున్నారని చెప్పారు.

అయినప్పటికీ ఈ చిత్రంలో జయలలిత పాత్రలో కంగన అద్భుతంగా నటించిందని సిమి గరేవాల్ కొనియాడారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత జయ పాత్రకు కంగన పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చిందని మనస్పూర్తిగా చెపుతున్నానని అన్నారు. కంగన చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు తాను మద్దతు పలకనని... అయితే ఆమె నటనా ప్రతిభను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేనని చెప్పారు. ఎంజీఆర్ పాత్రకు అరవిందస్వామి ప్రాణప్రతిష్ట చేశారని కొనియాడారు.