Nattikumar: నరేశ్ గారు.. బైక్ రేసుల గురించి ఇప్పుడు మాట్లాడొద్దు: నిర్మాత నట్టి కుమార్

Natti Kumar suggests Naresh not to speak about  bike racing
  • ప్రమాద సమయంలో సాయితేజ్ రేసింగ్ చేయడం లేదు
  • తక్కువ స్పీడ్ లోనే ఆయన వెళ్తున్నారు
  • ప్రస్తుత సమయంలో రాజకీయాలు వద్దు
సినీ హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలను సినీ నిర్మాత నట్టి కుమార్ తప్పుపట్టారు. సాయితేజ్ ను, తన కుమారుడు నవీన్ ను రేసింగ్ విషయంలో తాను హెచ్చరించానని నరేశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో నట్టి కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో రాజకీయాలు వద్దని అన్నారు. సాయితేజ్ త్వరలోనే కోలుకుని, త్వరగా మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని అందరం ప్రార్థిద్దామని చెప్పారు.

నరేశ్ గారు మాట్లాడింది తనకు నచ్చలేదని నట్టి కుమార్ అన్నారు. ప్రమాద సమయంలో సాయితేజ్ రేసింగ్ చేయడం లేదని... మామూలు డ్రెస్ లోనే వెళ్తున్నారని చెప్పారు. మీ ఇంటి నుంచి సాయితేజ్ బయల్దేరి వచ్చినట్టు మీరు చెపుతున్నారని... మీరు చెపుతున్నది తప్పు అనిపిస్తోందని అన్నారు. ఆయన ఇంటి నుంచి ఆయన వెళ్తున్నారని... దుర్గం చెరువు నుంచి వెళ్తున్నారని చెప్పారు.

ప్రమాద సమయంలో తక్కువ స్పీడ్ లోనే తేజ్ వెళ్తున్నారని అన్నారు. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల దురదృష్టవశాత్తు స్కిడ్ అయ్యాడని చెప్పారు. రేసింగ్ అనే పాయింట్లు ఇప్పుడు వద్దని అన్నారు. సాయితేజ్, మీ అబ్బాయి ఇద్దరూ స్నేహితులు అంటున్నారు కాబట్టి రేసింగ్ విషయాలు పక్కన పెట్టి... సాయితేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందామని నట్టి కుమార్ చెప్పారు.
Nattikumar
Tollywood
Naresh
Sai Dharam Tej

More Telugu News