సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా: విజయసాయిరెడ్డి

11-09-2021 Sat 14:42
  • అపోలో ఆసుపత్రిలో సాయితేజ్ కోలుకుంటున్నారు
  • సాయితేజ్ హెల్మెట్ ధరించడం సంతోషకరం
  • యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలి
Sai Dharam Tej should get well soon says Vijayasai Reddy

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయిధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ... ప్రమాదానికి గురైన యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. బైక్ పై వెళ్లేటప్పుడు ఆయన హెల్మెట్ ధరించడం సంతోషకరమని చెప్పారు. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ స్పందిస్తూ... సాయ్ ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ కావడం బాధాకరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.