చిన్నారి ఎదుటే ఈత కొలనులో మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ రాసలీలలు.. అరెస్ట్

11-09-2021 Sat 12:13
  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘటన
  • రిసార్ట్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో అసభ్యకర రీతిలో డీఎస్పీ, కానిస్టేబుల్
  • ఇద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
dsp heeralal saini arrested for doing obscene act with female constable in front of child in swimming pool

ఈత కొలనులో చిన్నారి ముందు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించిన రాజస్థాన్‌కు చెందిన డీఎస్పీ హీరాలాల్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో డీఎస్పీని అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వారితో పాటు మహిళ కుమార్తెగా చెబుతున్న చిన్నారి కూడా ఉంది. డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్ ఇద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ అరెస్ట్‌ను ఏడీజీ అశోక్ రాథోడ్ ధ్రువీకరించారు. రాజస్థాన్ పోలీస్ చీఫ్ డీజీ మోహన్‌లాల్ లాథర్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.