'అన్నాత్తే' సెకండ్ లుక్ .. వేటకొడవలితో రజనీ!

  • శివ దర్శకత్వంలో యాక్షన్ మూవీ
  • బలమైన కథాకథనాలు
  • ఆసక్తిని రేపే భారీతారాగణం
  • నవంబర్ 4వ తేదీన విడుదల
Annaatthe Second look released

రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగనుంది. ఈ సినిమా నుంచి రజనీ ఫస్టులుక్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో కుతూహలం పెరుగుతూ పోతోంది. 'వినాయక చవితి' సందర్భంగా నిన్న ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు.

జాతర నేపథ్యంలోని రజనీ లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం మొదలైంది. ఆ తరువాత కొంతసేపటికి సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక చేత్తో బైక్ ను నడుపుతూ మరో చేత్తో వేటకొడవలి పట్టుకుని దూసుకువచ్చే రజనీ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్టులుక్ కి మించిన మార్కులను సెకండ్ లుక్ కొట్టేసింది.

ఒక వైపున రజనీ .. మరో వైపున భారీ తారాగణం ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఖుష్బూ .. మీనా .. నయనతార .. కీర్తి సురేశ్ ముఖ్యమైన పాత్రల్లో అలరించనున్నారు. ఇక జాకీష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News