Vinayaka Chavithi: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు విద్యార్థుల గల్లంతు

  • గుంటూరు జిల్లా ఇనిమెళ్లలో ప్రమాదం
  • విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా సాగర్ కాల్వలో విద్యార్థుల గల్లంతు
  • విద్యార్థుల కోసం గాలిస్తున్న గజఈతగాళ్లు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. వీధుల్లో పెద్ద విగ్రహాలు పెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో మట్టి వినాయకుల విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈపూర్ మండలం ఇనిమెళ్లలో ప్రమాదం చోటుచేసుకుంది.

ఇంట్లో పెట్టిన వినాయక విగ్రహాలను నాగార్జునసాగర్ కుడి కాల్వలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఇద్దర్నీ దుర్గారావు, ఈశ్వర్ లుగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. గజఈతగాళ్లతో విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News