భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. పలు ప్రాంతాలు జలమయం

11-09-2021 Sat 11:41
  • గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయి వానలు
  • ఈ తెల్లవారుజామున కుండపోత
  • నదులను తలపిస్తున్న రహదారులు
  • లోతట్టు ప్రాంతాల మునక
Heavy Rains lashed new delhi

భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డుస్థాయిలో వానలు కురుస్తున్నాయి. ఇక, నిన్న ఉదయం నుంచి చిన్నగా కురుస్తున్న వర్షం ఈ ఉదయం కుండపోతగా మారింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వానకు రహదారులపైకి నడుము లోతులో నీళ్లు చేరి నదులను తలపిస్తున్నాయి.

భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అండర్ పాస్ వంతెన వద్ద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. మరోపక్క, రాగల 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.