సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

11-09-2021 Sat 07:40
  • 'ఉప్పెన' భామకు మరో బిగ్ ఆఫర్
  • యూకేకు వెళుతున్న ప్రభాస్
  • 'మా' ఎన్నికల బరిలో బాబూమోహన్  
Kruti Shetty opposite Allu Arjun in Icon

*  'ఉప్పెన' సినిమాతో ఒక్కసారిగా బిజీ స్టార్ గా మారిపోయిన కృతిశెట్టి ఇప్పుడు పలు తెలుగు సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో త్వరలో అల్లు అర్జున్ సరసన 'ఐకాన్' సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చినట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ, ఆ పాత్రలను పూజ హెగ్డే, కృతిశెట్టి పోషిస్తారని తెలుస్తోంది.
*  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న 'ఆదిపురుష్' షూటింగులో పాల్గొంటున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ వివిధ దశలలో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడట. ఈ మేకోవర్ కోసం అంతర్జాతీయ డైటీషియన్ల సలహాలు తీసుకోవడానికి త్వరలో ఆయన యూకేకు వెళుతున్నట్టు సమాచారం.
*  మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'కు త్వరలో ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. దీంతో అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో ప్రముఖ హాస్య నటుడు బాబూమోహన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు చెబుతున్నారు.