Sai Dharam Tej: నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ఇదిగో

Apollo Hospital latest health bulletin on Sai Dharam Tej
  • కాలర్ బోన్ విరగడం మినహా అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవన్న వైద్యులు
  • మరో 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే
  • రేపు మాట్లాడే అవకాశం ఉందన్న వైద్యులు
స్పోర్ట్స్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ప్రమాదంలో సాయి కుడి కంటి భాగంతో పాటు చాతీ భాగంలోనూ గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాలర్ బోన్ విరగడం మినహా శరీరంలో అంతర్గత గాయాలేవీ లేవని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. సాయిధరమ్ తేజ్ రేపు మాట్లాడే అవకాశం ఉందని వివరించారు.

సాయి తేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సాయి మద్యం తాగి డ్రైవ్ చేయలేదని, ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించే ఉన్నాడని పేర్కొన్నారు. రోడ్డుపై ఇసుక ఉండడంతో బండి జారి ప్రమాదం జరిగిందని వివరించారు. అల్లు అరవింద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సాయితేజ్ సేఫ్‌గానే ఉన్నాడని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
 
Sai Dharam Tej
Tollywood
Road Accident
Hyderabad

More Telugu News