Nithin: నితిన్ 31వ సినిమాకి .. పవర్ఫుల్ టైటిల్!

  • నితిన్ నుంచి 31వ సినిమా మొదలు
  • టైటిల్ గా 'మాచర్ల నియోజక వర్గం'
  • దర్శకుడిగా ఎస్.ఆర్. శేఖర్ పరిచయం  
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
Powerful title for Nithin 31st movie

చూస్తుండగానే నితిన్ 30 సినిమాలు పూర్తిచేశాడు. కెరియర్ పరంగా తనకి ఎదురైన ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాడు. కెరియర్ పరంగా ఎక్కడా గ్యాప్ రాకుండా, యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన 31వ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'మాచర్ల నియోజక వర్గం' టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విధ్వంసం సృష్టించిన విలన్ గ్యాంగ్ తన వైపుకు దూసుకు వస్తుంటే, ధైర్యంగా వాళ్లకి ఎదురు నిలిచిన నితిన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

దాంతో ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువేనని అర్థమవుతోంది. సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

More Telugu News