ఏపీలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి!
- క్రమంగా పెరుగుతున్న రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు
- 1,608 మందికి పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 281 కొత్త కేసులు
- రాష్ట్రంలో తాజాగా 6 మరణాలు
- ఇంకా 15,119 మందికి చికిత్స
అదే సమయంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,27,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,98,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,119 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,970కి పెరిగింది.