అనూష కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన నారా లోకేశ్

09-09-2021 Thu 21:02
  • నరసరావుపేటలో హత్యకు గురైన అనూష
  • నరసరావుపేట వెళ్లేందుకు ప్రయత్నించిన లోకేశ్
  • గన్నవరంలో అడ్డుకున్న పోలీసులు
  • ఫోన్ ద్వారా అనూష కుటుంబంలో ధైర్యం నింపిన లోకేశ్
Nara Lokesh video call to Anusha family members

నరసరావుపేటలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను కలవాలన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ వీడియో కాల్ లో అనూష కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారిలో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. తాను తప్పకుండా వచ్చి కలుస్తానని, అప్పటివరకు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.

చెల్లిని తిరిగి తేలేను కానీ, తమ్ముడ్నయినా జాగ్రత్తగా చూసుకుందాం అని భరోసా ఇచ్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని, అనూష కేసులో వాదించేందుకు పేరుమోసిన న్యాయవాదులను నియమించుకుందామని తెలిపారు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనూష తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డను చంపిన వ్యక్తి హాయిగా తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.