చిరూ చేతుల మీదుగా 'గల్లీ రౌడీ' ట్రైలర్ రిలీజ్!

09-09-2021 Thu 18:18
  • సందీప్ కిషన్ హీరోగా 'గల్లీ రౌడీ'
  • దర్శకుడిగా జి. నాగేశ్వర రెడ్డి 
  • కథానాయికగా నేహా శెట్టి పరిచయం 
  • ఈ నెల 17వ తేదీన విడుదల
Gully Rowdy trailer will launch at Septembar 11th

సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి 'గల్లీ రౌడీ' సినిమాను చేశాడు. కోన వెంకట్ - ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించడానికి ఒక ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు.

ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 'గల్లీ రౌడీ' ట్రైలర్ ను లాంచ్ చేయనున్న 'స్టేట్ రౌడీ' అంటూ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. సందీప్ కిషన్ జోడీగా నేహా శెట్టి పరిచయమవుతోంది.

యాక్షన్ కామెడీ సినిమాలు చేయడంలో జి. నాగేశ్వరరెడ్డి సిద్ధహస్తుడు. గతంలో ఆయన సందీప్ తో చేసిన 'తెనాలి రామకృష్ణ బీఎబీఎల్' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే రేంజ్ లో ఈ సినిమా కూడా సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి. రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిషోర్ ... పోసాని కృష్ణమురళి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.