అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన సోను సూద్

09-09-2021 Thu 17:21
  • విజయవాడ పర్యటనకు వెళ్లిన సోను సూద్
  • సోను సూద్ ను కలిసిన అమరావతి రైతులు
  • రైతుల వెంట ఉంటానని చెప్పిన సోను
Sonu Sood gives support to Amaravati farmers

అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు గత 632 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమానికి ప్రముఖ సినీ నటుడు సోను సూద్ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోను సూద్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇదే సమయంలో ఆయనను అమరావతి రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతివ్వాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను రైతుల వెంట ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు విజయవాడ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.