రీమేక్ సినిమాలు చేయాలనుకోవడం లేదు: హీరో నాని

09-09-2021 Thu 17:05
  • 'టక్ జగదీష్' విభిన్నంగా ఉంటుంది
  •  అందరూ కొత్త నానీని చూస్తారు
  • 'శ్యామ్ సింగ రాయ్' ఈ ఏడాదిలోనే
  • వచ్చే ఏడాదిలో 'అంటే సుందరానికీ'  
Tuck Jagadish movie update

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. ఈ సినిమా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ, " ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఆ తరువాత నేను చేసే సినిమాలు కూడా కొత్తగా ఉంటాయి .. ఇకపై అందరూ ఒక కొత్త నానీని చూస్తారు" అన్నారు.

"గతంలో నేను కొన్ని రీమేక్ లు చేశాను .. అవి అంతగా ఆడలేదు. అందువలన నేను రీమేక్ ల ఆలోచన చేయడం లేదు. ఆల్రెడీ ఎక్కడో ఎవరో చేసినవి ఇక్కడ నేను చేయాలనుకోవడం లేదు. మన సినిమాలు వేరేవాళ్లు రీమేక్ చేసుకునేలా ఉండాలి. అలాంటి కొత్త కథలను ఎంచుకునే ఆలోచనలో ఉన్నాను" అని చెప్పారు.

''ఇక 'శ్యామ్ సింగ రాయ్' చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను ఈ  ఏడాది చివరిలో ప్లాన్ చేస్తున్నాము. అలాగే 'అంటే సుందరానికీ!' సినిమా మూడో షెడ్యూల్ షూటింగులో ఉన్నాము. చాలా బాగా వస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.