ముగిసిన రవితేజ ఈడీ విచారణ.. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన విచారణ

09-09-2021 Thu 16:33
  • సాయంత్రం 4 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రవితేజ
  • బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించిన అధికారులు
  • విచారణకు సహకరిస్తానన్న రవితేజ
Raviteja ED enquiry if over

డ్రగ్స్ కేసులలో ప్రముఖ సినీ నటుడు రవితేజ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్, కెల్విన్ సన్నిహితుడు జిషాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఈ ఉదయం కరెక్ట్ సమయానికి రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇక సాయంత్రం 4 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి ఆయన బయటకు వచ్చారు. మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ... ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా బ్యాంకు వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా రవితేజ హామీ ఇచ్చారు.