Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Nayanatara says she would continue in films even after marriage
  • కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన నయనతార 
  • చివరి షెడ్యూలులో 'విరాటపర్వం'
  • 'మ్యూజిక్ స్కూల్' కోసం శ్రియ డ్యాన్స్  
*  దర్శకుడు విగ్నేశ్ శివన్ ని త్వరలోనే పెళ్లి చేసుకోనున్న కథానాయిక నయనతార ఇకపై నటనను కొనసాగించడంపై స్పష్టతనిచ్చింది. వివాహం అనంతరం కూడా సినిమాలలో నటిస్తానని, నటనను విరమించే ప్రసక్తే లేదని సన్నిహితులకు తాజాగా చెప్పిందట. అందుకే, కొత్త సినిమాలను కూడా అంగీకరిస్తున్నట్టు తెలిపింది. దీంతో ఆమెతో సినిమాలు నిర్మించాలనుకుంటున్న నిర్మాతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
*  రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'విరాట పర్వం' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  ప్రముఖ నటి శ్రియ తాజాగా 'మ్యూజిక్ స్కూల్' అనే చిత్రంలో నటిస్తోంది. బియ్యాల పాపారావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె నాట్యకళాకారిణిగా కనిపిస్తుంది. దీని గురించి ఆమె చెబుతూ, 'నేను బేసికల్ గా కథక్ డ్యాన్సర్ ని. ఇప్పుడీ చిత్రం కోసం మరో డ్యాన్స్ ను కూడా నేర్చుకుంటున్నాను' అని చెప్పింది.
Nayanatara
Rana Daggubati
Sai Pallavi
Shriya

More Telugu News