సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మాతృమూర్తి కన్నుమూత

08-09-2021 Wed 08:33
  • శుభలేఖ సుధాకర్ కుటుంబంలో విషాదం
  • ఆయన తల్లి ఎస్ఎస్ కాంతం మృతి
  • మూడు నెలల కిందట గుండెపోటుకు గురైన కాంతం
  • క్షీణించిన ఆరోగ్యం.. నిన్న మృతి 
Subhalekha Sudhakar mother dies of illness
ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎస్ఎస్ కాంతం కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. చెన్నైలో నిన్న ఆమె తుదిశ్వాస విడిచారు. శుభలేఖ సుధాకర్ తల్లి కాంతం మూడు నెలల కిందట గుండెపోటుకు గురయ్యారు. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది.

వయసు పైబడడం, ఇతర అనారోగ్య కారణాలతో ఆమె పరిస్థితి విషమించగా, నిన్న ఉదయం మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి. శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణారావు రెండేళ్ల కిందటే కన్నుమూశారు.