థియేటర్ల వైపే మొగ్గుచూపుతున్న 'విరాటపర్వం'

  • నక్సలిజం నేపథ్యంలో 'విరాటపర్వం'
  • ముగింపు దశలో షూటింగు 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • ముఖ్యమైన పాత్రలో ప్రియమణి 
Virataparvam in Theatres

రానా ప్రధానపాత్రధారిగా 'విరాట పర్వం' సినిమా రూపొందింది. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలగటం వలన, ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం వలన మళ్లీ నిన్న సెట్స్ పైకి వెళ్లారు.

అయితే ఎన్నో రోజులు కాదు .. కేవలం 5 రోజుల చిత్రీకరణతో షూటింగు పార్టును పూర్తిచేయనున్నారు. ఇక 'నారప్ప' మాదిరిగానే ఈ సినిమాను కూడా ఓటీటీకే ఇచ్చే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేసే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నారనేది తాజాగా వినిపిస్తున్న మాట.

ఇప్పటికే థియేటర్లు తెరుచుకుని చాలా రోజులైంది. సరైన సినిమా పడితే థియేటర్ల దగ్గర జనం పెరుగుతారనే టాక్ వినిపిస్తోంది. దసరా తరువాత థియేటర్ల దగ్గర సందడి పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్ బాబు తన మనసు మార్చుకున్నారని అంటున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో ప్రియమణి కనిపించనుంది.

More Telugu News