Virender Sehwag: పవన్ కల్యాణ్ డైలాగ్ తో అలరించిన వీరేంద్ర సెహ్వాగ్... వీడియో ఇదిగో!

Dashing Virender Sehwag imitates power star Pawan Kalyan
  • నాక్కొంచెం తిక్కుంది అంటూ పవన్ డైలాగ్
  • గబ్బర్ సింగ్ లో పాప్యులరైన డైలాగ్
  • అందరినీ ఆశ్చర్యపరిచిన వీరూ
  • పవన్ మేనరిజంతో డైలాగ్ పలికిన వైనం
భారత క్రికెట్లో విధ్వంసక బ్యాటింగ్ తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగుతో అలరించారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ "నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది" అంటూ పలికిన డైలాగ్ ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సెహ్వాగ్ నోట కూడా అదే డైలాగు పలికింది. సెహ్వాగ్ అచ్చం పవన్ లా మెడపై చేతితో రుద్దుకుంటూ ఈ డైలాగు చెప్పడం వైరల్ అవుతోంది. పక్కన ఓ యువతి పవన్ డైలాగును చెబుతుండగా, సెహ్వాగ్ కూడా అదే రీతిలో డైలాగు చెప్పడం వీడియోలో చూడొచ్చు.
Virender Sehwag
Pawan Kalyan
Dialogue
Gabbar Singh

More Telugu News