ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసుల నమోదు

07-09-2021 Tue 16:05
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు  
  • రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,452
AP registers more than 1000 positive cases again

ఏపీలో నిన్న వెయ్యి కంటే తక్కువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు... ఈ రోజు మళ్లీ వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 9 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,266 మంది కరోనా నుంచి కోలుకోగా... 10 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,23,242కి పెరిగింది. ఇప్పటి వరకు 19,94,855 మంది కోలుకున్నారు. మొత్తం 13,935 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి.