Samantha: సమంత ఫ్యాషన్ తళుకులు... లూయి విట్టోన్ కు మోడలింగ్!

Samantha dazzled in Louis Vuitton fashion wears
  • ఫ్యాషన్ ఐకాన్ గా సమంతకు పేరు
  • తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు
  • లూయి విట్టోన్ అవుట్ ఫిట్స్ లో మెరిసిన సమంతా
  • ఆకట్టుకుంటున్న ఫొటోలు
దక్షిణాది తారల్లో ఫ్యాషన్ ఐకాన్లుగా చెప్పుకోదగ్గ వారిలో సమంత ఒకరు. ట్రెండీ అవుట్ ఫిట్స్ తో ఇంట్లోనూ, బయట సమంత తన ప్రత్యేకతను చాటుకుంటుంది. తాజాగా ఈ సొట్టబుగ్గల అమ్మడు ప్రపంచ ప్రఖ్యాత లూయి విట్టోన్ డ్రెస్సులు, ఇతర ఉపకరణాలు ధరించి తళుక్కుమంది. దీనికి సంబంధించిన ఫొటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

ఆపాదమస్తకం లూయి విట్టోన్ఫ్యాషన్ వేర్స్ ధరించిన సమంత పలు పోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లూయి విట్టోన్... ను ఎల్వీ అని పిలుస్తుంటారు. వరల్డ్ వైడ్ ఫ్యాషన్ షోలలో ఎల్వీ దుస్తులు, ఇతర ఉపకరణాలు తప్పనిసరిగా ప్రదర్శిస్తుంటారు.
Samantha
Louis Vuitton
Fashion
Modeling
Tollywood

More Telugu News